Saturday, April 20, 2024
- Advertisement -

ఫేస్ బుక్ లో విజయ్ దేవరకొండతో అమ్మాయిలకు వల..!

- Advertisement -

ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో టాలీవుడ్ యువ హీరో విజయ్‌ దేవరకొండ పేరుతో ఖాతా ఓపెన్ చేసి అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అతడి మోసాన్ని మోసంతో తిప్పి కొట్టాడు. తన సహాయకుడితో అమ్మాయిలా ఆ మోసగాడితో చాటింగ్‌ చేయించాడు.

దాంతో ఆ మోసగాడు చేస్తున్న బాగోతం నిర్ధారణ అయింది. దాంతో విజయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయ్‌ దేవరకొండ పేరుతో చాలా కాలం నుంచి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాతో ఓ యువకుడు అమ్మాయిలతో చాటింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించ్చారు. విజయ్‌ దేవర కొండ పేరుతో చాటింగ్‌ చేస్తూ.. ఆ తర్వాత ‘నా డబ్బింగ్‌ ఆర్టిస్టుతో చాటింగ్‌ చేయండి’ అంటూ తన అసలు ఫేస్‌బుక్ ఖాతాను అమ్మాయిలకు పంపిస్తున్నాడు.

దాంతో పాటు తన ఫోన్‌ నంబర్‌ కూడా ఇస్తున్నాడు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తూ లవ్ లో పడేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ఇదే విషయంను కొందరు విజయ్ కు చెప్పడంతో.. ఆయన దీనిపై దృష్టి పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -