Thursday, March 28, 2024
- Advertisement -

పండ‌గ ఆశ‌లన్ని ‘ఎఫ్‌ 2’ మీదే..!

- Advertisement -

సంక్రాంతి పండుగ వ‌స్తుందంటే చాలు టాలీవుడ్‌ క‌ళ క‌ళ‌లాడుతోంది. అయితే గతం, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. గ‌తంలో సంక్రాంతి పండుగ వ‌స్తుందంటే చాలు చాలా సినిమాలు విడుద‌ల అయ్యేవి. ఓ అర‌డ‌జ‌ను సినిమాల వ‌ర‌కు సంక్రాంతి పండ‌క్కి విడుద‌లైవి. కాని ఇప్ప‌డు ఆ ప‌రిస్థితి లేదు. రెండు , మూడు సినిమాల క‌న్నా ఎక్కువ విడుద‌ల కావ‌డం లేదు. ఈ సంక్రాంతికి కూడా మూడు సినిమాలే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి.

ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయకుడు, రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ‌,వెంకీ వ‌రుణ్‌ల ఎఫ్ 2 సినిమాలు ఈ పండ‌క్కి విడుద‌ల‌వుతున్నాయి. వీటిలో క‌థానాయ‌కుడు, విన‌య విధేయ రామ సినిమాలు ఇప్ప‌టికే విడుద‌లయ్యాయి. ఈ రెండు సినిమాల‌కు మిక్స్‌డ్ టాక్ రావ‌డంతో అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. క‌థానాయ‌కుడు సినిమా అనుకున్నంత లేద‌ని టాక్ వినిపించింది. సినిమాలో కొన్ని సీన్లు మాత్ర‌మే బాగున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ రోజే విడుద‌లైన రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ కూడా అనుకున్నంత లేద‌నే టాక్ వస్తోంది. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో హింస త‌ప్ప మ‌రోక‌టి లేద‌ని తేల్చేశారు ప్రేక్ష‌కులు. ఇక పండ‌గ ఆశ‌లన్ని వెంకీ ,వ‌రుణ్‌ల ఎఫ్ 2 సినిమాపైనే ఉన్నాయి. పండ‌క్కి విడుద‌ల‌వుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

పండ‌క్కి ఫ్యామిలీతో క‌లిసే చూసే సినిమా ఇదే ఒక్క‌టే కావ‌డంలో ఈ జోన‌ర్ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.పైగా ఈ సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పైగా వెంకీ చాలా రోజులు త‌రువాత ఫుల్ కామెడీ క్యారెక్ట‌ర్ చేయ‌డం,త‌మ‌న్నా, మెహ్రీన్ గ్లామ‌ర్ సినిమాకు ఫ్ల‌స్ పాయింట్‌గా నిలిచే అవ‌కాశం ఉంది. సినిమా ట్రైల‌ర్‌ను చూసిన ప్రేక్ష‌కులు సినిమాను చూడాల‌ని ఫిక్స్ అయినట్లు క‌నిపిస్తోంది.సంక్రాంతికి విడుద‌లైన రెండు సినిమాలు ఆక‌ట్టుకోవ‌డం ఫెయిల్ కావ‌డంతో, ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ సినిమాపైనే ప‌డింది. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ‌ను క్యాష్ చేసుకుంటుందో లేదో చూడాలి. ఎఫ్‌ సినిమా రేపే(శ‌నివారం) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -