Friday, April 26, 2024
- Advertisement -

‘మా’ ఎన్నిక‌ల్లో క‌నిపించ‌ని స్టార్స్ ,ఎవ‌రు నోరు మెద‌ప‌రే….!

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ ఎన్నిక‌లు నిన్న ఆదివారం ఫిలిం చాంబ‌ర్‌లో జ‌రిగాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి మా అధ్య‌క్ష ఎన్నిక‌లు జరిగాయి. శివాజీ రాజా, న‌రేశ్ మా సంఘం అధ్య‌క్షులుగా పోటీ చేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ జ‌ర‌గ‌డంతో రెండు వ‌ర్గాలు విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేశాయి. ఈ ఎన్నిక‌ల‌లో నరేశ్ శివాజీ రాజాపై 68 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల‌లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగ‌ర్జున వంటి హీరోలో తమ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నిక‌ల‌లో స్టార్ హీరోలు ఎక్క‌డ క‌నిపించలేదు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోల‌తో పాటు బాల‌కృష్ణ‌, వెంకీ వంటి సీనియ‌ర్ హీరోలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేదు. త‌మ ఇండస్ట్రీకి సంబంధించిన ఎలెక్ష‌న్స్ జ‌ర‌గుతుంటే వీరు ఎవ‌రు రాక‌పోవడం చాలా దారుణం. ఏమైన అంటే మా క‌ళామ్మ త‌ల్లి, అంద‌రం ఒక్క‌టే అని తెగ బిల్డ‌ప్‌లు కొడుతుంటారు. ప‌వ‌న్ , ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్‌లు హైద‌రాబాద్‌లో ఉండి కూడా మా ఎన్నిక‌ల‌కు రాలేద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ఎన్నిక‌ల‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల రాలేక‌పోయార‌ట‌. మరి శ్రీరెడ్డి ఏదో అన్న‌ద‌ని ఫిలిం చాంబ‌ర్‌కు వ‌చ్చి ర‌చ్చ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇప్పుడు ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఎలెక్ష‌న్స్ జ‌ర‌గుతున్న అటువైపు కూడా చూడ‌క‌పోవ‌డం విశేషం.

ఇక ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు రాజ‌యౌళి సినిమాలో బిజీగా ఉన్నారు. ఏ మా ఎలెక్ష‌న్స్ కోసం ఓ గంటసేపు షూటింగ్ వాయిదా వేస్తే వ‌చ్చే న‌ష్టం ఏంటో అర్థం కావ‌డం లేదు. ఇక మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమా షూటింగ్‌లో చైన్నైలో ఉన్నాడు. చైన్నై నుంచి హైద‌రాబాద్‌కు ఫైట్‌లో గంట‌లో రావ‌చ్చు కాని , ఆ ఎన్నిక‌లు జోలి నాకెందుకు అనుకున్నాడు అనుకుంటా మ‌హేశ్ , త‌న ప‌ని త‌ను చేసుకున్నాడు. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలంద‌రు త‌మ ఇండ‌స్ట్రీకి చెందిన ఎన్నిక‌ల‌కు హాజ‌రుకాక‌పోవ‌డంపై చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇదే స్టార్స్ తెలంగాణలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో క్యూ క‌ట్టి మ‌రి ఓటు వేశారు.

ఎందుకంటే త‌మ సినిమాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు కావాలి కాబ‌ట్టి , హీరోలంద‌రు క్యూలో నిల‌బడి ఓట్లు వేశారు. కాని మా ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌క‌పోయిన అడిగే ధైర్యం ఎవ‌రు చేయ‌రని వారి ధీమా. వీరికి త‌గినట్లుగా మా స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న కూడా ఉంది. వారు షూటింగ్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్లే ఓటింగ్ రాలేక‌పోయార‌ని మా స‌భ్యులు వారిని వెన‌కేసుకువ‌స్తున్నారు. అయిన వారికి లేని దుర‌ద మన‌కేందుకు అని ప్రేక్ష‌కులు కూడా ఈ విష‌యాన్ని లైట్ తీసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -