Saturday, April 20, 2024
- Advertisement -

హాస్య న‌టుడు బ్ర‌హ్మాంనందానికి గుండె ఆప‌రేష‌న్‌..

- Advertisement -

తెలుగు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం(62)కు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్‌ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది.

బ్రహ్మానందం కుటుంబసభ్యులంతా ప్రస్తుతం ముంబయిలోనే ఉన్నారు. ఆయన కుమారుడు రాజా గౌతమ్, సిద్ధార్థ్ దగ్గరుండి తండ్రిని దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.హాస్యబ్రహ్మ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఒకే భాషలో ఎక్కువ సినిమాల్లో నటించిన నటుడిగా బ్రహ్మానందం గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కిన సంగ‌తి తెలిసిందే. బ్రహ్మానందం మొత్తం 1000కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -