Wednesday, April 24, 2024
- Advertisement -

పెళ్లి పీట‌లెక్క‌నున్న టాలీవుడ్ యంగ్ హీరో..

- Advertisement -

తెలుగు తెరపై కెరియర్ ఆరంభంలోనే దూకుడు చూపించిన యువ కథానాయకులలో రాజ్ తరుణ్ పేరు కూడా చెప్పుకోవచ్చు. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రాజ్‌ తరుణ్ త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఇద్దరి లోకం ఒక్కటే అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా తరుణ్ ట్విట్టర్ ద్వారా అభిమానుల‌కు తెలియ‌జేశాడు.

అయితే పెళ్లికూతురు ఎవరి అమ్మాయి? ఎక్కడ అమ్మాయి? చిత్రపరిశ్రమకి సంబంధించినవారి అమ్మాయా? బయట అమ్మాయా? అనే విషయాన్ని మాత్రం ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు.అంతేకాదు తనది లవ్ కమ్ అరేంజ్డ్ మేరేజ్ అని కూడా అన్నాడు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోయే రాణిని పరిచయం చేస్తానన్నాడు. మరి రాజ్ తరుణ్ వివాహమాడనున్న ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -