Friday, April 19, 2024
- Advertisement -

హెబ్బా పటేల్ ను పట్టించుకోరా ఏంటి…

- Advertisement -

టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ను ఈమధ్యన జనాలు పట్టించుకోవడం మానేశారు. ఈమెకు పోటీగా అను ఇమ్మాన్యుల్, మెహ్రీన్ లు రావడంతో అమ్మడు కాస్త మసకబారింది. అయినప్పటికీ అమ్మడు సినిమాలు చేస్తుంది. బట్ ఇప్పటి వరకు హెబ్బా మరొక హీరోయిన్ కు దెబ్బ కొట్టేలా పెద్ద సినిమా ఒక్కటి కూడా సంపాదించలేకపోయింది.

ముందునుంచి టామ్ బాయ్ క్యారెక్టర్లే చేయడం హెబ్బాకు మైనస్ గా మారింది. ఒకవేళ హెబ్బాను బన్నీ లాంటి బడా యంగ్ హీరో ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో వెళ్లిపోవచ్చు. కాని ఈ హీరోలు హెబ్బాను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నారు. ఈ అమ్మడు పర్ ఫార్మెన్స్ పాత్రలు కూడా చేయగలదు అని ఓ సారి ప్రూవ్ చేసుకుంటే… ఆఫర్లు రావచ్చు. అలా ఎలా చిత్రంలో అలాంటి పాత్రనే చేసింది. కాని ఏంలాభం వర్కవుట్ కాలేదు. దాంతో ఆ నటనా ప్రతిభ వేస్ట్ అయిపోయింది.

ఇప్పుడు ఏంజిల్ చిత్రం చేస్తున్నప్పటికీ… ఆ సినిమా అయినా అమ్మడిని ఏమైనా పైకి తెస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. కారణం… ఈ సినిమాలో కూడా ఈ కుర్రదాని అందాలను ఎరగా వేసి… దేవకన్య పాత్ర వేసి… ఏదో ఒకలా ఆడియన్స్ కు టైమ్ పాస్ అయ్యేలా చకేసి… సినిమాను లాగేయాలని చూసే ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ హెబ్బాను ఆడియన్స్ పట్టించుకున్నంతగా నిర్మాతలు, దర్శకులు పట్టించుకోవడం లేదు. జస్ట్ గ్లామర్ ప్రోపర్టీలా మాత్రమే ట్రీట్ చేయడం ఈమె కెరియర్ కు ఇబ్బందిగా మారింది. వన్స్ ఆ థాట్ వీరిలో మారితే… తోటి హీరోయిన్లకు పోటీ ఇచ్చే దిశగా హెబ్బాను తయారుచేయవచ్చు. ఏం కాదంటారా….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -