డ్రగ్స్ కేసులో హీరోయిన్ లను కావాలని తప్పిస్తున్నారా..?

211
Top Heroes in Bollywood Drug Case
Top Heroes in Bollywood Drug Case

డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు సంచలనం రేకెత్తించే పేర్లు బయటకి రాగా ఇక హీరోల వంతు అన్నట్లు ఇప్పుడు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం హీరోయిన్స్ పేర్లు మాత్ర‌మే బ‌య‌ట‌కొచ్చాయి. అయితే ద‌ర్యాప్తు వేగం పెంచ‌టంతో ప‌లువురు అగ్ర‌న‌టుల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

ముఖ్యంగా బాలీవుడ్ A న‌టుల పేర్లు ఎన్సీబీ విచార‌ణ‌లో బ‌య‌టికొచ్చిన‌ట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువడుతున్నాయి. త్వ‌ర‌లో వారికి కూడా స‌మ‌న్లు జారీ చేసి విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీపికా, సారా అలీఖాన్, శ్ర‌ద్ధ క‌పూర్, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన వివ‌రాల ఆధారంగా అంద‌రి స‌మాధానాలను ఎన్సీబీ విశ్లేషిస్తుంది.

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు తీగ లాగితే డొంకంతా క‌దులుతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతుంది. సుశాంత్ మృతితో లింక‌యిన డ్ర‌గ్స్ అంశంలో ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్ల‌ను ప్ర‌శ్నించిన నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులు వారిచ్చిన స‌మాచారం ఆధారంగా మ‌రికొంద‌రిపై ఫోక‌స్ చేసింది.

Loading...