Friday, April 19, 2024
- Advertisement -

‘నగ్నం’ ట్రైలర్.. వర్మ పెట్టిన టికెట్ రేటు ఇదే..!

- Advertisement -

‘శివ’ లాంటి చరిత్రలో నిలిచిపోయే మూవీ తీసిన వర్మ.. ఇప్పుడు తన పంతా మార్చుకుని 18 ప్లస్ వారు మాత్రమే చూసే సినిమాలతో వస్తున్నాడు. తాజాగా మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే సినిమాని ప్రేక్షకుల మీదకి వదిలాడు. సినిమా ఎలా ఉన్నా 100 రూపాయలు టికెట్ రేట్ పెట్టి డబ్బులు మాత్రం బాగానే వసూలు చేసుకున్నాడు.

ఈ మూవీని దాదాపుగా మూడు లక్షల మంది ఆన్లైన్ లో చూశారట. అంటే మూడు కోట్ల రూపాయలు క్లైమాక్స్ పేరు మీదా వర్మ తన అకౌంట్లో వేసుకున్నాడు. ఇక ఇటీవలే ‘నగ్నం’ అనే చిన్న సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించిన వర్మ అప్పుడే ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నేను రాజమౌళి ని కాదు.. ఇది ‘RRR’ కాదు ఇది ‘NNN’ అంటూ రిలీజ్ చేసాడు.

‘క్లైమాక్స్’ కంటే మించి రెచ్చగొట్టేలా ఉన్న ఈ ‘నగ్నం’ టీజర్ చూస్తే ఇంత వరకు ఏ డైరక్టర్ కూడా లేడీస్ పై ఈ యాంగిల్ లో కెమెరా పెట్టలేదని చెప్పవచ్చు. ఇందులో నటించిన అమ్మాయి ముఖం చూపించకుండా కేవలం బాడీ పార్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ఇక దీనిని కూడా ఆర్జీవీ వరల్డ్ లో రిలీజ్ చేయబోతున్నాడు వర్మ. ఈ చిన్న సినిమాని 200 రూపాయలు పెట్టాడు. మరి ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ తో వర్మ ఎన్ని కోట్లు వేనకేస్తాడో చూడాలి.

https://youtu.be/lWwsFh4vttE

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -