Thursday, April 25, 2024
- Advertisement -

మళ్ళీ త్రివిక్రమ్ ఆమెనే తీసుకుంటున్నాడా..?

- Advertisement -

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ కి మంచి పేరుంది.. రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత డైరెక్టర్ గా మారి టాప్ దర్శకుల లిస్ట్ లోకి అనతి కాలంలోనే చేరిపోయాడు..  వరుస హిట్ లు పెద్ద హీరోలతో కొట్టడంతో త్రివిక్రమ్ తో సినిమా చేస్తే హిట్ కొడతామని టాప్ హీరోలు గుడ్డిగా అయన తో సినిమా లు చేస్తున్నారు.. త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత మంచి హిట్ ని ఇచ్చింది.  ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా టాప్ మోస్ట్ హిట్ గా నిలిచింది..

అయితే త్రివిక్రమ్ పై మొదటి సారి అయన అభిమానులు పెదవి విరుస్తున్నారట..అందుకు కారణం అయన తాజా సినిమా లో కూడా పూజ హెగ్డే నే హీరోయిన్ గా పెట్టుకోవడం అంటున్నారు.. తాజాగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరక్కబోయే సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతుంది అని.. హీరోయిన్స్ ని ఎక్కువగా రిపీట్ చేసే త్రివిక్రమ్ చూపు మళ్ళీ పూజ పైనే పడిందనే టాక్ మొదలైంది.

అరవింద సామెత, అలా వైకుంఠపురములో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ లకు పూజ హెగ్డే నే రిపీట్ చేసాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కి మరో హీరోయిన్ ఛాయస్ లేకపోవడంతో పూజ హెగ్డే నే మళ్ళి ఎన్టీఆర్ కోసం సెట్ చేయబోతున్నాడని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం పూజ వద్దు బోర్ అంటున్నారట. గతంలోనూ త్రివిక్రమ్ ఇలియానా, సమంత ని ఇలానే వరుస సినిమాల్లో పెట్టేశాడు.. దాంతో అప్పట్లో కూడా త్రివిక్రమ్ పై విమర్శలు వచ్చాయి.. మళ్ళీ ఇప్పుడు అవే విమర్శలు వస్తున్నాయి.. వాస్తవానికి టాలీవుడ్ లో పూజ తప్పా వేరే ఆప్షన్ లేదు.. కాజల్, సమంత, తమన్నా లు అలోమోస్ట్ కెరీర్ ఎండింగ్ లో ఉన్నారు.. ఇక కుర్ర హీరోయిన్ లు రష్మిక, నభా నటేష్ లకు అంత మెచూరిటీ రాలేదు. దాంతో అందరు పెద్ద హీరోలు పూజ నే నమ్ముకున్నారు..

విజయ్ కోసం అనుష్క ప్రయత్నాలు..అస్సలు సెట్ అవదేమో..?

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

త్రివిక్రమ్ వల్ల మహేష్ , చరణ్ ల మధ్య గ్యాప్ పెరగనుందా..?

పవన్ కళ్యాణ్ కేజిఎఫ్ తో తట్టుకుని నిలబడ గలడా..? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -