Thursday, March 28, 2024
- Advertisement -

‘మా’లో మ‌రో వివాదం.. ప‌ద‌వికి ఎస్వీ కృష్టారెడ్డి రాజీనామా..!

- Advertisement -

తెలుగు మూవీ ఆర్టిస్ట్‌లోని లుక‌లుక‌లు మ‌రోసారి బ‌య‌ట‌పడ్డాయి. సాధార‌ణ ఎన్నిక‌ల మాదిగానే మూవీ ఆర్టిస్ట్ సంఘం ఎన్నిక‌లు కూడా జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులు ఒక‌రిపై మ‌రోక‌రు తీవ్ర విమ‌ర్శలు చేసుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో శివాజీ రాజాపై న‌టుడు న‌రేశ్ ఘ‌న విజ‌యం సాధించాడు. శివాజీ రాజా ప్యానెల్లో విజ‌యం సాధించిన ద‌ర్శకుడు ఎస్వీ కృష్టారెడ్డికి అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవి ద‌క్కింది.

అయితే తాజాగా ఈ ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాన్ని ఆయన వెల్లడించకపోయినా,అసోసియేషన్ లో నిధుల దుర్వినియోగమే రాజీనామాకు కారణమని తెలుస్తోంది. మరోవైపు, అసోసియేషన్‌లో వివాదాలతో పాటు లుక‌లుక‌లు కార‌ణంగానే ఆయ‌న ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎస్వీ కృష్టారెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -