హీరోయిన్ లయ గుర్తుందా ? ఇప్పుడు ఎక్కడుందంటే ?

2017
Unknown facts about actress Laya
Unknown facts about actress Laya

సీనియర్ హీరోయిన్ లయ అప్పట్లో వరుస సినిమాలతో.. అందులోనూ వరుస హిట్లతో దూసుకెళ్ళి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ‘స్వయంవరం’ ‘మనోహరం’ ‘ప్రేమించు’ ‘దేవుళ్ళు’ ‘హనుమాన్ జంక్షన్’ ‘శివ రామ రాజు’ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది.

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన ‘విజయేంద్ర వర్మ’ చిత్రంలో కూడా నటించింది. అయితే తరువాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి బై చెప్పేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే.. ఈ బ్యూటీ అంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాంటి ఈ హీరోయిన్ ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టు అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. హీరో శివాజీతో చేసిన ‘అదిరిందయ్యా చంద్రం’ చిత్రం తర్వాత ఈమెకు అవకాశాలు బాగా తగ్గుతూ వచ్చాయట. ఆ క్రమంలో పలు మలయాళం,తమిళ్, కన్నడ సినిమాల్లో నటించినా అక్కడ కూడా సేమ్ రిజల్ట్.

దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. ఓ ఎన్నారై ను పెళ్ళి చేసుకుంది. లయ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యింది. ఆమె అక్కడ తన భర్త బిజినెస్ ను చూసుకుంటుంది. ఈమెకు ఓ పాప మరియు బాబు ఉన్నారు. ఈమె కూతురు రవితేజ నటించిన అమర్ అక్భర్ ఆంటోని సినిమాలో నటించింది. ఇక లయ కూడా మళ్లీ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమాతో లయ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Loading...