ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూత!

678
Upasana Grand father Is No More
Upasana Grand father Is No More

రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు (92) కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాంతో కామినేని ఫ్యామిలీలో విషాదం నెలకొంది. కామినేని ఉమాపతిరావు తెలంగాణలోని దోమరకొండ సంస్థానంలో జన్మించిన చివరి వ్యక్తి, ఉమాపతిరావు ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా సేవలు అందించారు.

అంతేకాకుండా టీటీడీ తొలినాళ్లలో ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా పని చేశారు. తాత ఉమాపతిరావుతో ఉపాసనకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆయన లేరన్న విషయం ఆమె తట్టుకోలేకపోతుంది. తన సోషల్ మీడియా పేజ్ ద్వారా నివాళులు అర్పించింది. మీరందరు కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో ప్రేమని కురిపించాలంటూ కోరింది. దీనితో ఉపాసన సన్నిహితులు.. మెగా అభిమానులు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.

ఉపాసన సోషల్ మీడియా మాధ్యమాలలో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. ”మా తాత కె.ఉమాపతి రావు గొప్ప విలువలు నిస్వార్థం గల మానవతామూర్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత” అంటూ భావోద్వేగమయ్యారు. ఉపాసన తన తాతని ప్రేమగా ‘ఉమా తాత’ అని పిలిచేదట. కాగా ఇంతకముందు కూడా ఉపాసన తాత ఉమాపతి 90వ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఆయనతో గల జ్ఞాపకాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు.

Loading...