Saturday, April 20, 2024
- Advertisement -

బయట చరణ్ కి ఇంట్లో చరణ్ కి చాలా డిఫరెంట్ : ఉపాసన

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాక్కర్లేదు. ఆమె మెగా కోడలిగా.. సమాజ సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులారిటీ సంపాధించుకున్నారు. వారసత్వంగా వస్తున్న అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు చూసుకుంటూనే సోషల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు చేస్తూ మహిళా హక్కులపై ఆమె పోరాడుతోంది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.

చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు స్వతంత్రంగా పెంచారని.. నమ్మంగా ఎలా ఉండాలో ఎలా జీవించాలో నేర్పించారని.. అంతేకాకుండా తనకు అన్ని విషయాల్లో ఎంతో ప్రోత్సాహం ఇచ్చేవారని ఉపాసన చెప్పింది. వాళ్ల వల్లే తాను ఈ రోజున స్వతంత్ర మహిళగా నిలబెడగలిగానని చెప్పింది. తన లైఫ్ లో నాన్న ప్రభావం ఎక్కువగా ఉందని.. ఎలాంటి కఠనమైన పరిస్థితుల్లోనైన ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన వద్ద నేర్చుకున్నదేనని చెప్పింది. ఇతరను ఆప్యాయతగా పలకరించడ.. ప్రేమించడం వంటి ఎన్నో ఆయనను చూసి నేర్చుకునవేనని ఉపాసన తెలిపింది. అయితే పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఉపాసన చెప్పింది.

మెట్టినింటిలో అడుగుపెట్టాక లైఫ్ లో సర్దుబాటు అంటే ఏంటో తెలిసిందని.. అడ్జస్ట్ అయి బ్రతకడం నేర్చుకున్నానని.. కాస్త ఇబ్బంది కూడా పడ్డానని చెప్పింది. తనకు నచ్చిన సెలబ్రిటీని వివాహం చేసుకోవడం అదృష్టమని, ఆన్‌స్క్రీన్ రామ్ చరణ్‌కి ఇంట్లో ఉండే రామ్ చరణ్‌కి చాలా తేడా ఉంటుందని ఆమె చెప్పింది. కాకపోతే ఆ సీక్రెట్ మాత్రం చెప్పను అని చెప్పింది. తాము భార్య భర్తల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటామని.. ఒకరి వృతిని మరొకరం గౌరవిస్తామని చెప్పింది. ఇక ఈ లాక్ డౌన్ టైంలో ఇద్దరికి చాలా టైం దొరికిందని.. అందుకే ఇంట్లోనే ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశామని ఉపాసన తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -