Friday, March 29, 2024
- Advertisement -

మెగా హీరో చిత్రం నుండి వైదొలిగిన విజయ్ సేతుపతి

- Advertisement -

విజయ్ సేతుపతి.. ఈ పేరు తెలియని సినిమా అభిమానులు ఎవరూ లేరు. అయితే విజయ్ సేతుపతి ని ప్రతి ఒక్కరూ తమ సినిమా లో కచ్చితంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. పైగా విజయ్ ఇటీవలే సై రా నరసింహ రెడ్డి సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కూడా అడుగు పెట్టడం తో తెలుగు లో చాలా మంది విజయ్ తో సినిమా చేయాలి అని అనుకుంటున్నారు. ఆ కోవ లోనే మెగా ఫ్యామిలీ నుంచి హీరో గా వస్తున్న వైష్ణవ తేజ్ సినిమా ఉప్పెన కోసం విజయ్ సేతుపతి ని అడిగారు. విజయ్ కూడా వెంటనే సినిమా ఒప్పుకున్నాడు.

ఈ సినిమా కి సంబంధించి కొన్ని రోజులు కూడా విజయ్ షూట్ చేసాడట. అయితే అనూహ్యంగా ఈ సినిమా ఆలస్యం అవుతూ రావడం వలన విజయ్ డేట్స్ వృధా అయ్యాయట. అందుకనే ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి వైదొలగాలని అభిప్రాయానికి వచ్చాడట. ఈ సినిమా ని సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా లో విజయ్ సేతుపతి కొనసాగుతాడా లేదా అనేది ప్రస్తుతానికి మిస్టరీ గా నే ఉంది. దీని పై త్వరలో చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -