Thursday, March 28, 2024
- Advertisement -

సైరా వివాదాలకి కారణం ఇదేనా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. కానీ సినిమా చుట్టూ అలుముకున్న వివాదాలు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఉయ్యాలవాడ వారసులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడింది. కానీ అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. నిజానికి ఉయ్యాలవాడ నరసింహ కుటుంబం లో 400 మంది దాకా ఉన్నారు. దాదాపు 30 నుంచి 40 కుటుంబ సభ్యులు చిరంజీవి మరియు రామ్ చరణ్ ని కలిశారు. వారిలో కొందరు ఎటువంటి గౌరవ వేతనం అడగలేదు కానీ మిగతా వారికి ఈ విషయం నచ్చలేదు.

కాబట్టి వారు సినిమా తీసినందుకు గౌరవ వేతనం రూపంలో 50 కోట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కానీ సినిమాకే బోలెడంత బడ్జెట్ పెడుతున్న రామ్ చరణ్ ఆ భారీ మొత్తానికి ససేమిరా ఒప్పుకోలేదు. పోనీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ లో కొంత మొత్తాన్ని ఇద్దామని అనుకున్నారు కానీ ఈ విషయమై మాట్లాడడానికి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల నుంచి ఒక కుటుంబ పెద్ద ఎవరూ కనిపించలేదు. వారిలో వారికే ఐకమత్యం లేక కొన్ని గ్రూప్స్ గా మారి సినిమా కి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉయ్యాలవాడ నాలుగవ జనరేషన్ నుండి దొరవారి దస్తగిరి రెడ్డి సినిమా విడుదలను ఆపేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హై కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -