నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం.. కుమారుడు కన్నుమూత..!

795
vanisri son passes away
vanisri son passes away

అలనాటి అందాల సినీ నటి వాణిశ్రీ అంటే గుర్తుపట్టాని వారు ఉండరు. ఆ సినీయర్ నటి ఏకైక కుమారుడు డా.అభినయ్ వెంకటేశ్ (36) మృతి చెందాడు. అయితే, ఆయన గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. తమిళనాడులోని చెంగల్‍పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్ లో ఆయన ఈ ఘటనకు పాల్పడ్డాడు.

లాక్ డౌన్ కారణంగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. అయితే కొన్ని సమస్యల కారణంగా ఆయన కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఆయన గుండెపోటుతో మృతి చెందాడని ముందుగా వార్తలు వచ్చాయి. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేసిన అభియన్ వెంకటేశ్, తర్వాత రామచంద్రన్ కాలేజీలో ప్రొఫెసర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు.

అభియన్‌కు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 70,80వ దశకంలో తెలుగు చిత్ర సీమలో కథానాయికగా ఓవెలిగిన వాణిశ్రీ.. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌నే పెళ్లి చేసుకున్న వాణిశ్రీకి ఒక కుమారుడు.. ఒక కుమార్తె ఉన్నారు.

Loading...