Friday, March 29, 2024
- Advertisement -

ప్ర‌భాస్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా – విశాల్ హీరోయిన్‌

- Advertisement -

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్‌కు అమ్మాయిల‌లో ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో అంద‌రికి తెలిసిందే. డార్లింగ్ సినిమాతో అమ్మాయిల‌లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు ప్ర‌భాస్‌. ఇక బాహుబ‌లి సినిమాతో ఈ క్రేజ్‌ను మ‌రింత పెంచుకున్నాడు. ప్ర‌భాస్ అంటే చాలు అమ్మాయిలు పిచ్చి ఎక్కిపోతారు. ఇప్పుడు ఈ పిచ్చి హీరోయిన్స్ వ‌ర‌కు పాకింది. తాజాగా తమిళ హీరోయిన్ ప్ర‌భాస్‌కు ప్ర‌పోజ్ చేసింది. త‌మిళ స్టార్ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మి ఇటీవ‌లే హీరోయిన్‌గా ఎంట్రి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌లు సినిమాల‌లో లేడీ విల‌న్‌గా కూడా న‌టించి మెప్పించింది. తాజాగా ఈ భామ ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు ప్ర‌భాస్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టింది. నేను ఎవ‌రికి అయిన ప్ర‌పోజ్ చేస్తాను అంటే అది ఒక్క ప్ర‌భాస్‌కు మాత్ర‌మే అని చెప్పి సంచ‌ల‌నానికి తెర‌లేపింది.

య‌స్ ప్ర‌భాస్‌కు ‘ఐ లవ్ యూ’ అని చెప్పాలని ఉంద‌ని త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట‌కు చెప్పింది. ప్ర‌భాస్ అంటే నాకు పిచ్చి, అత‌ను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాన‌ని చెప్పింది. మ‌రి ఈ ప్ర‌పోజ‌ల్‌పై ప్ర‌భాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. వ‌ర‌ల‌క్ష్మి గ‌తంలో హీరో విశాల్‌తో ప్రేమ‌లో ఉంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. వీరిద్ద‌రు చాలాకాలం పాటు డేటింగ్ చేశార‌ని త‌మిళ మీడియాలో వార్త‌లు రావ‌డం మ‌నం చూశాం. త‌రువాత వీరి మ‌ధ్య అభిప్రాయభేదాలు రావ‌డంతో వీరిద్ద‌రు వీడిపోయారు. ఇటీవ‌లే విశాల్ వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడు.ఇటు ప్ర‌భాస్ కూడా హీరోయిన్ అనుష్క‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -