Friday, March 29, 2024
- Advertisement -

విశాల్ ని అంత మాట అనేసిందేంటి?

- Advertisement -

హీరో విశాల్ కి తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కి మధ్య ప్రేమ సంబంధం ఉంది అని ఇంతకు ముందు తమిళ మీడియా వాళ్ళు చాలా వార్తలే రాసారు కానీ ఈ ఇద్దరు నటులు వాటిని ఖండిస్తూ వారు కేవలం మిత్రులే అని చెప్పుకొచ్చారు. కానీ విశాల్ కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ ఆయె ముందు దాకా కూడా వీరు ఇరువురు పెళ్ళి చేసుకుంటారు అనే వార్తలే మీడియా లో హల్చల్ చేశాయి. అది పక్కన పెడితే ఇప్పుడు వరలక్ష్మి విశాల్ పై తీవ్రం గా మండిపడ్డారు.

నడిగర్ సంగం ఎన్నికల సందర్భం గా ఇప్పుడు తన తండ్రి శరత్ కుమార్ పైన వ్యతిరేక కాంపైన్ నడుపుతున్నాడు అనే ఆరోపణలు చేస్తూ వరలక్ష్మి విశాల్ పై తీవ్రం గా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా లో ఈ విషయం పై స్పందిస్తూ వరలక్ష్మి ఒక పెద్ద పోస్ట్ రాశారు. ఇలా విశాల్ దిగజారాల్సిన అవసరం లేదని,విశాల్ చేస్తున్న పనులు చూస్తుంటే, తను ఎలా పెరిగాడో అర్ధం అవుతుంది అని కామెంట్స్ చేస్తూ వరలక్ష్మి తన అసంతృప్తి ని వ్యక్తపరిచారు.

ప్రస్తుతం కోలీవడ్ లో ఈ విషయం గురించే అందరూ చర్చ చేస్తున్నారు. అయితే ఈ విషయమై విశాల్ ఇప్పటి వరకు స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -