వరుణ్, సాయి ధరంలు రెమ్యునరేషన్ ఎంతంటే ?

643
Varu Tej And Sai Dharam Tej Remuenerations
Varu Tej And Sai Dharam Tej Remuenerations

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలాకు మెగాస్టార్ చిరంజీవి ఓ బాట వేశారు. అందులో ఇప్పుడు వాళ్లు మంచి సినిమాలతో రాణిస్తున్నారు. మెగాస్టార్ వేసిన బాటలో పవన్ కల్యాణ్-నాగబాబు-రామ్ చరణ్ – అల్లు అర్జున్- అల్లు శిరీష్- వరుణ్ తేజ్- సాయి తేజ్- నిహారిక- కళ్యాణ్ దేవ్- వైష్ణవ్ తేజ్ నడుస్తున్నారు. పవన్, చరణ్, బన్నీ ఇప్పటికే స్టార్ హీరోల స్థాయిలో రాణిస్తున్నారు. ఆ తర్వాత రేస్ లో వరుణ్ తేజ్- సాయితేజ్ పేర్లే వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ 2014లో కెరీర్ ప్రారంభించారు. ఇప్పటికే ఆరేళ్లయ్యింది.

13 నవంబర్ 2014లో సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వులేని జీవితం రిలీజైంది. అలాగే అదే ఏడాది 24 డిసెంబర్ న వరుణ్ తేజ్ నటించిన ముకుంద రిలీజైంది. ఈ ఐదారేళ్లలో ఆ ఇద్దరూ సాధించిన ప్రగతి ఎంత? పారితోషికంలో ఎవరి సత్తా ఎంత? అంటే… ఎవరి రేంజు వారికి ఉంది. అయితే రేసులో సాయి తేజ్ ఇటీవల వెనకబడ్డాడు. కొన్ని వరస ఫ్లాపులు అతడి స్థాయిని తగ్గించాయి. రెండు వరుస హిట్ల (చిత్రలహరి- ప్రతిరోజూ పండగే) తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు.

అయితే వరుణ్ తేజ్ మాత్రం 90శాతం సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నాడు. కెరీర్ లో ఫిదా- తొలి ప్రేమ లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అందువల్ల అతడు సాయి తేజ్ కంటే పారితోషికం ఎక్కువ అందుకుంటున్నాడని తెలుస్తోంది. సాయి తేజ్ 2- 3 కోట్ల రేంజులో ఉంటే.. వరుణ్ తేజ్ మాత్రం పారితోషికంలో 4-5 కోట్ల రేంజులో ఉన్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎఫ్ 2 సక్సెస్ తర్వాత వరుణ్ 200 శాతం పెంచి 9-10 కోట్ల మేర డిమాండ్ చేశాడన్న ప్రచారం సాగింది. రెండు వరుస హిట్ల తర్వాత సాయి తేజ్ సైతం 2.5 కోట్ల నుంచి ఒక్కసారిగా 5కోట్లకు పెంచాడన్న సమాచారం ఉంది. సాయితేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రంలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ (వీటీ 10)లో నటిస్తున్నాడు.

Loading...