Friday, April 26, 2024
- Advertisement -

వరుణ్ సందేశ్ కెరీయర్ ఇలా కావడానికి కారణం ఇదే..!

- Advertisement -

టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. హ్యాపీడేస్ తో మంచి హీరో అనిపించుకున్నాడు. తర్వాత సోలో హీరోగా చేసిన కొత్త బంగారు లోకం సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత వరుస పరాజయల చూశాడు వరుణ్ సందేశ్. అయితే తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ తన కెరీర్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ” తెలుగులో నా మొదటి సినిమా హ్యాపీడేస్.. తర్వాత కొత్త బంగారు లోకం. ఈ రెండు సినిమాలతో నాకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత అవకాశాలు వచ్చాయిగానీ విజయాలు దక్కలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. దాంతో కాలం కలిసి రావడం లేదు.

ఈ సమయంలో నేను ఏ సినిమా చేసినా ఫ్లాపు అవుతుందని భావించి గ్యాప్ తీసుకున్నాను. పారితోషికం ఇవ్వకపోయినా ఫరవాలేదు .. మంచి కంటెంట్ మాత్రం ఉండాలి. అలాంటి కథ వచ్చినప్పుడే చేద్దామనే ఉద్దేశంతో, కొంతకాలం పాటు అమెరికాలో ఉండిపోయాను” అని వరుణ్ సందేశ్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -