Friday, March 29, 2024
- Advertisement -

శివజ్యోతి అంటే నాకు నచ్చదు : వితిక కామెంట్స్

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో వరుణ్, వితికా ఎంతో సందడి చేశారు. బిగ్ బాస్ షో వల్ల హౌస్ లో వితిక, వరుణ్ మధ్య గొడవలు కూడా వచ్చాయి. కొన్ని సార్లు హౌస్ లో వీరిద్దరు మాట్లాడుకోలేదు. అయితే అందరి మీదకంటే వితిక, వరుణ్ పైనే అందరిలో ఆసక్తి ఉండేది. ఎందుకంటే ఫస్ట్ టైం భార్యభర్తలు బిగ్ బాస్ లోకి రావడం. బిగ్ బాస్ వల్ల మంచి పేరు వస్తుందా.. చెడ్డ పేరు వస్తుందా చెప్పలేం. అయితే వరుణ్, వితికలకు మాత్రం మంచి పేరు వచ్చిందని చెప్పాలి.

మంచి వాడు, నిజాయితీ గల వ్యక్తిగా వరుణ్‌కు పేరు వస్తే.. కాస్త కన్నింగ్ అని వితికాకు ట్యాగ్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి వీరు బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. బిగ్‌బాస్ షోలో ఉన్నంత సేపు వరుణ్, వితికా, పునర్నవి, రాహుల్ క్లోజ్ గా ఉండేవాళ్లు. బయట కూడా వీరు క్లోజ్ గా ఉంటున్నారు. ఈ నలుగురి ఫ్రెండ్‌షిప్ ఈ సీజన్ కు బాగా ప్లస్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన వితికా, వరుణ్‌లు పార్టీలు, వెకేషన్‌లు అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదగా షోలో పాల్గొన్నారు.

అంతేకాకుండా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో “వితికా కాకుండా వేరే ఏ హీరోయిన్‌ను పెళ్లి చేసుకునేవాడివి? అంటూ వరుణ్‌ను అడగ్గా.. ఇలియానా అని చెప్పేశాడు. హౌస్‌లో ఇష్టమైన వారు ఎవరని వితికాను అడగ్గా.. పునర్నవి అని టక్కున చెప్పేసింది. అయితే ఇష్టం లేని వారు ఎవరంటే మాత్రం శివజ్యోతి” అని చెప్పింది. హౌస్ లో కూడా వితికకు, శివజ్యోతికి అసలు పడేది కాదు. ఇక ఈ ప్రోమోని మీరు ఓ సారి చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -