Thursday, April 25, 2024
- Advertisement -

వరుణ్, వెంకీ కి సంపాదన ఇలా కూడా!

- Advertisement -

అరేబియన్ నైట్స్ కథల లో మనకి అత్యంత పాపులర్ అయిన కథ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ. చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు చదువుకున్నాం మరియు వీడియో గేమ్ కూడా మనం ఆడి ఉన్నాం. అయితే కొన్ని రోజుల ముందట దీని మీద ఒక సినిమా కూడా వచ్చిన సంగతి మనకి తెలిసిందే. తెలుగు లో పాపులర్ హీరోలు వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ వాయిస్ తో ఈ సినిమా యొక్క ట్రైలర్ తెలుగు లో విడుదల చేసి సినిమా ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు దర్శక నిర్మాతలు.

అనూహ్యంగా ఈ సినిమా కి తెలుగు లో క్రేజ్ ఏర్పడింది. గత నెల విడుదల అయిన ఈ చిత్రం దాదాపుగా 350 థియేటర్ల లో విడుదల అయింది. ఈ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా కి అన్ని థియేటర్లు ఇస్తారు అని ఎవరూ అనుకోలేదు కూడా. ఇండియా లో తెలుగు తో పాటు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అయింది. అయితే వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ గొంతు ఇవ్వటం ఈ సినిమా కి ఒక స్పెషల్ అసెట్. దీని వల్ల సినిమా ని చాలా మంది చూసారు. అయితే తాజా గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం హీరోలు ఇద్దరికీ ఈ తెలుగు బిజినెస్ లో కొంత వాటా ఇచ్చారని, అది కూడా ఇటీవలే వాళ్లకి అందింది అని తెలుస్తుంది. ఇలా ఇంగ్లీష్ సినిమా కి డబ్బింగ్ మరియు ప్రమోషన్స్ లో హెల్ప్ చేస్తే రెవిన్యూ వస్తుంది అని, ఇలా కూడా సంపాదించుకోవచ్చు అని ఈ హీరోలు ఇద్దరూ ప్రూవ్ చేశారు.

ఇది లా ఉంటె, వారిద్దరు కలిసి నటించిన F2 ఈ ఏడాది మొదట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో మనకి తెలుసు. మళ్ళి ఈ కాంబినేషన్ ని తెర మీద చూడాలని చాలా మంది అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -