అదిరిపోయే స్టెప్పులతో మెగా హీరో సందడి

319
Varun Tej & Dimple Hayathi Mass Number
Varun Tej & Dimple Hayathi Mass Number

ఈ మధ్యనే ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అథర్వ మురళి ముఖ్య పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో సరికొత్త పాత్రలో మాస్ అవతారంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ‘జర్ర జర్ర’ అనే మొదటి పాట వీడియోని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

తాజాగా ఈ పాట వీడియో సాంగ్ కి సంబంధించిన టీజర్ ను ఇప్పుడు విడుదల చేయగా, టీజర్ వీడియోలో వరుణ్ తేజ్ మరియు డింపుల్ హయతి అదిరిపోయే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వరుణ్ తేజ్ లుక్ ఈ సినిమాకి కచ్చితంగా బలాన్ని చేకూరుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ వీడియో సాంగ్ నీ థియేటర్ కో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ ఆచంట గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కాబోతోంది.

Loading...