Thursday, April 25, 2024
- Advertisement -

అచ్చు పవన్ కళ్యాణ్ లాగానే కనిపిస్తున్న మెగా హీరో

- Advertisement -

యువ హీరో వరుణ్ తేజ్ ఈ మధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ‘వాల్మీకి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ మధ్యనే కార్ ఆక్సిడెంట్ లో గాయపడ్డ వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ ఫోటో షూట్ నుంచి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుబురు గడ్డంతో వరుణ్ తేజ్ సరికొత్త లుక్తో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వరుణ్ తేజ్ గడ్డంతో అచ్చు తన బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా వరుణ్ తేజ్ మ్యానరిజమ్స్ కూడా పవన్ కళ్యాణ్ లాగే అనిపించటంతో మెగా అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరున్ తేజ్ మొదటి రౌడీ పాత్రలో కనిపించి తర్వాత హీరో గా మారుతాడు. అథర్వ మురళి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పతాకంపై ఆచంట రామ్, ఆచంట గోపీనాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -