వరుణ్ తేజ్ – శేఖర్ కమ్ముల – దిల్ రాజు చిత్రం షూటింగ్ ప్రారంభం

192
Varun Tej - Sekhar Kammula - Dil Raju Film to roll from August 5th

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,  దర్శకుడు శేఖర్ కమ్ముల,నిర్మాత దిల్ రాజు కలయికలో ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం రూపొందనుంది. మాలర్ ఫేమ్ సాయి పల్లవి ఈ చిత్రం లో హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ రేపు (ఆగస్టు 5) నిజామాబాద్ జిల్లా లో బాన్స్వాడ లో ప్రారంభం అవుతుంది.

ఉదయం 9:30 నిమిషాలకు ఈ చిత్రం టైటిల్ ను, థీమ్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.  ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం.

ఈ చిత్రానికి ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫి విజయ్ కుమార్, సంగీతం శక్తి కాంత్ అందిస్తారు. ఇతర  తారాగణం, మరియు  సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

Loading...