Tuesday, April 23, 2024
- Advertisement -

చిరంజీవి బయోపిక్ లో చేస్తా అంటున్న వరుణ్ తేజ్

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన కొత్త చిత్రం సై రా నరసింహ రెడ్డి కి సంబందించిన ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో సంతోషం గా ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఆయన మీద సినిమా చేయాలని చాలా మంది ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు కానీ హరీష్ శంకర్ మాత్రమే నోరు విప్పి ఈ విషయాన్ని బయట పెట్టారు. ఇదే విషయం మీద వరుణ్ తేజ్ కూడా తన కామెంట్ ని చేశారు.

అయితే మెగా స్టార్ మీద బయోపిక్ అంటే మాములు విషయం కాదు. ఆ విషయం తెలిసి కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎంతో కొంత రీ సర్చ్ చేసి ఉంటారు. ఇకపోతే ఈ విషయమై వరుణ్ తేజ్ మాట్లాడుతూ, చిరంజీవి బయోపిక్ లో చిరంజీవి నటిస్తే నే బాగుంటుంది అని, ఒకవేళ చిరంజీవి కాకుండా మరొకరు ఎవరైనా చేయాల్సి వస్తే తాను చేస్తా అని ప్రకటించాడు.

ఇది వినడానికి బాగానే ఉన్నా, అసలు వరుణ్ చిరంజీవి పాత్ర కి న్యాయం చేస్తాడు అని ఒక నిర్ధారణ కి అంత త్వరగా రాలేము. కాకపోతే వాల్మీకి సినిమా ప్రమోషన్స్ లో భాగం గా కాస్త అటెన్షన్ కోసం ఇలా చెప్పారా లేదా సీరియస్ గా నే ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారా అనే విషయం మనకి తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -