Tuesday, April 23, 2024
- Advertisement -

‘వాల్మీకి’ సినిమా నుండి ఎనర్జిటిక్ పాట

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘వాల్మీకి’ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమా తెలుగు రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో సిద్ధార్థ మరియు బాబీ సింహా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా తెలుగులో వరుణ్ తేజ్ మరియు అథర్వ మురళి ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తే వరుణ్ తేజ్ సినిమాలో విలన్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పుకోవచ్చు.

ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో మాస్ అవతారంలో వరుణ్ తేజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘జర్రా జర్రా’ అనే పాట వీడియో ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఎనర్జిటిక్ గా సాగే ఈ పాట కి మిక్కీ జే మేయర్ సంగీతం చాలా బాగా ప్లస్ అయింది. భాస్కరభట్ల రవికుమార్ అందించిన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా సింగర్స్ గొంతు పాటకి మరింత హైలైట్ అయింది. రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -