Thursday, April 25, 2024
- Advertisement -

వాల్మీకి ప్రీమియర్స్ టాక్..

- Advertisement -

ఈ మధ్యనే ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ అవతారంలో ‘వాల్మీకి’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్హిట్ అయిన ‘జిగర్తాండా’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఆధార్వ మురళీ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే మరియు మృణాళిని రవి లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

టీజర్ మరియు ట్రైలర్ మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన పాటలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అందరూ ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకం తో నే ప్రమోషన్స్ చేశారు.

తాజాగా ఈ సినిమా కి సంబందించిన అమెరికా ప్రీమియర్స్ పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళు అందరూ ఈ సినిమా బాగుంది అని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కి మంచి ఓపెనింగ్స్ వచ్చే లాగా ఉన్నాయి. వరుణ్ కెరీర్ లో కూడా బెస్ట్ సినిమా అవుతుంది అని చెప్పుకుంటున్నారు.

రామ్ ఆచంట మరియు గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -