Friday, April 19, 2024
- Advertisement -

వెంకీ కుతురు ప్రేమ వివాహం చేసుకోనుందా?

- Advertisement -

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ విక్ట‌రీ వెంక‌టేష్ సీని ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 30 సంవ‌త్స‌రాలు అవుతున్న ఎప్పుడు త‌న ఫ్యామిలీని త‌న సినిమా ఫంక్ష‌న్స్‌కు తీసుకురాలేదు.అస‌లు ఆయ‌న భార్య కాని, పిల్ల‌లు కాని బ‌య‌ట ప్ర‌పంచానికి పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు .అయితే వెంకీకి కుతురు ,కొడుకు ఉన్న సంగ‌తి తెలిసిందే.వెంక‌టేశ్ కుమార్తె అశ్రిత ప్రేమ వివాహం చేసుకోబోతుంద‌ని వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.వెంకీ కుమార్తె అశ్రిత గ‌త కొంత‌కాలంగా ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉంద‌ట‌.వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెల‌ప‌డంతో త్వ‌ర‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది.అశ్రిత ప్రేమించింది ఎవ‌రినో కాదు హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని అని తెలుస్తోంది.

వీరి మ‌ధ్య చ‌దువుకునే రోజులు నుంచే స్నేహం ఉంద‌ట‌,ఆ స్నేహం కాస్తా ప్రేమ‌గా మారింద‌ని స‌మ‌చారం.పెళ్లి బంధంతో ఒకటవ్వాలని నిర్ణయించుకుని పెద్దలకు ఈ విషయాన్ని చెప్పేశారు. పెద్ద‌లు వీరి పెళ్లికి అంగీకారం తెలిపారు.అశ్రిత ప్రేమ గురించి సోద‌రుడు సురేష్ బాబుతో చ‌ర్చించిన త‌రువాతే వెంకీ పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.అశ్రిత ప్రొఫెషనల్ బేకర్. బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకున్నారు. `ఇన్ ఫినిటీ ప్లేటర్` పేరుతో హైదరాబాద్ నగరంలో పలు స్టాల్స్ ని నిర్వహిస్తున్నారు. త్వ‌ర‌లోనే అశ్రిత నిశ్చితార్థ వేడుకను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి వెంకీ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్‌2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

https://www.youtube.com/watch?v=KKBubWKIrBU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -