Thursday, March 28, 2024
- Advertisement -

‘కంచరపాలెం’పై వెంకీ ప్ర‌శంస‌లు

- Advertisement -

ఇటీవ‌ల కాలంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి.అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు ద‌ర్శ‌క – నిర్మాత‌లు కూడా కొత్త‌గా ఆలోచిచండం మొద‌లు పెట్టారు.కంటెంట్‌తో వ‌చ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా కూడా మంచి విజయం సాధించింది.తాజాగా ఆ కొవకే చెందిన సినిమా ‘కంచరపాలెం.ట్రైల‌ర్‌తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఈ సినిమా.క‌థ న‌చ్చ‌డంతో సినిమా హీరో రానా త‌న సొంత బ్యానర్‌లో విడుద‌ల చేశారు.

ఈ రోజే(శుక్ర‌వారం) విడుద‌ల అయిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమాపై సీనియర్ మీరో విక్ట‌రీ వెంక‌టేష్ స్పందించారు..” ఇది చాలా బ్రిలియంట్ ఫిల్మ్ ,నాకు బాగా నచ్చింది. తెలుగు సినిమాను సరికొత్త మార్గంలో ఈ సినిమా నడిపిస్తుందని అనిపిస్తోంది. ప్రేక్షకులపై ఈ సినిమా మంచి ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నాను. ఇంతమంచి సినిమాను రానా సమర్పించడం నాకు చాలా గర్వంగా వుంది” అంటూ దర్శక నిర్మాతలకు,నటీనటులకు త‌న ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు వెంకీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -