బిగ్‌బాస్ 3 గురించి కామెంట్ చేసిన వెంకీ

527
Venkatesh respond on big boss 3
Venkatesh respond on big boss 3

విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం ఎఫ్‌- 2 సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు. వెంకీ , వ‌రుణ్ తేజ్‌లు న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సంక్రాంతి కానుకగా రేపు విడుద‌ల కానుంది సినిమా. ఎఫ్‌- 2 సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతున్న వెంకీకి బిగ్‌బాస్ -3 గురించి ఓ ప్ర‌శ్న ఎదురైంది. అది ఏటంటే బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌కు వెంకీ వ్యాఖ్య‌త‌గా రానున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

దీనిపై ఇంట‌ర్య్వూలో వెంకీని అడ‌గ్గా… అదంతా ఒక రూమర్ అని వెంకీ సింపుల్ గా ఒక ఆన్సర్ ఇచ్చేశాడు. అసలు ఎవరు కూడా వెంకీని కలవలేదని చెప్పుకొచ్చాడు. అయితే వ‌చ్చి అడిగితే చేస్తాన‌ని కాని, చేయ‌న‌ని కాని స్ప‌ష్టం చేయ‌లేదు వెంకీ. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు ఎన్టీఆర్ యాంక‌రింగ్ చేయ‌గా, రెండో సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హరించాడు.మూడో సీజ‌న్‌లో ఎవ‌రు యాంకరింగ్ చేస్తారో ఇంకా తెలియ‌డం లేదు.