వెంకటేష్ కొడుకును చూశారా ? హీరోలా అయ్యాడు..!

6963
Venkatesh Son Arjun In Rana Miheeka Gettogether function
Venkatesh Son Arjun In Rana Miheeka Gettogether function

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు చిరంజీవి – నాగార్జున – బాలయ్య.. వీళ్ల గురించి.. వీళ్ల పిల్లల గురించి అందరికి తెలుసు. అయితే మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మాత్రం ఇండస్ట్రీ బయట వ్యక్తులకి పెద్దగా తెలియదు. వెంకీ భార్య, పిల్లల గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అంతేకాకుండా వెంకటేష్ తన భార్య, పిల్లలను ఎప్పుడూ బయటకు తీసుకుని రారు. అయితే వెంకటేష్ – నీరజా దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఆశ్రిత – హయవాహిని – భావన అనే ముగ్గురు కుమార్తెలు.. అర్జున్ అనే కుమారుడు ఉన్నారు.

అయితే వెంకటేష్ తనయుడు అర్జున్ మాత్రం అప్పుడప్పుడు తళుక్కుమంటుంటాడు. వెంకటేష్ – మహేష్ కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో ఫంక్షన్ లో.. వెంకీ – పవన్ కాంబోలో వచ్చిన ‘గోపాల గోపాలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో దగ్గుబాటి అర్జున్ కనిపించాడు. అంతేకాకుండా వెంకటేష్ పెద్ద అమ్మాయి ఆశ్రిత వివాహ వేడుకల్లో కూడా అర్జున్ కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనపడలేదు. అయితే ఇప్పుడు లేటెస్టుగా మరోసారి దర్శనమిచ్చాడు అర్జున్. ఇటీవలే దగ్గుబాటి రానా, మిహికా ఫ్యామిలీ గెట్ టూ గెదర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానా – మిహికాలకు సినీ ప్రముఖులందరూ విషెస్ తెలియజేశారు. అయితే ఈ గెట్ టూ గెదర్ లోని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

ఆ ఫోటోల్లో వెంకీ కొడుకు అర్జున్ కూడా ఉన్నారు. అర్జున్ ను చూసిన ఫ్యాన్స్.. కాబోయే హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో అర్జున్ ని చూసిన వారు ఇప్పుడు ఈ ఫొటోలో అర్జున్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆశ్రిత పెళ్లిలో చిన్నప్పిల్లాడిలా కనిపించిన అర్జున్.. ఇప్పుడు గడ్డంతో.. నూనూగు మీసాలతో పెద్ద వాడిలా.. హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అర్జున్ ను చూసిన వెంకీ ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. అయితే అర్జున్ తన స్టడీస్ కంప్లీట్ అయ్యాకే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఏది ఏమైన వెంకీ తనయుడ్ని చూసి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Loading...