Thursday, March 28, 2024
- Advertisement -

“వెంకీ మామ” మూవీ రివ్యూ

- Advertisement -

విక్టరీ వెంకటేష్, నవ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యలు హీరోలుగా రాశి ఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా కెఎస్ రవింద్ర(బాబీ) డైరెక్షన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా ”వెంకీ మామ”. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

కార్తీక్(నాగ చైతన్య) తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. దాంతో అతని భాధ్యతను మావయ్య వెంట రత్నం(వెంకటేష్) తీసుకుని తన జీవితం మొత్తం కార్తీక్ కోసమే త్యాగం చేస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల కార్తీక్ ఆర్మీలో చేరుతాడు. ఈ విషయం వాళ్ల మావయ్యకు చెప్పడు. ఈ క్రమంలో కార్తీక్ ఆ ఆర్మీ క్యాంపులో అకస్మాత్తుగా మిస్సయ్యిపోతాడు. అసలు కార్తీక్ ఆర్మీలో చేరడానికి కల ముఖ్య కారణం ఏంటి ? అతను ఎలా మిస్సయ్యాడు ? కథనంలో ఏర్పడే చిక్కులను అధిగమించి అతని మావయ్య వెంకీ అతన్ని ఎలా కనుగొన్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

వెంకీ, చైతూల కాంబోలో ఓ సినిమా వస్తుందంటే అది కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అందుకు తగ్గట్లే ఈ చిత్రంలో వెంకీ మరియు చైతులు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతి సీన్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. వెంకీ, చైతు ఫ్యాన్స్ కి అయితే మరింత ఎక్కువగా నచ్చుతుంది. అలానే వీరిద్దరికి లీడ్ పెయిర్స్ గా నటించిన పాయల్, రాశి ఖన్నాలు కూడా పోటీ పడుతూ నటించారు. ఈ జంటల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అలానే సాంగ్స్, కామెడీ కూడా బాగుంది. ఎమోషనల్ ఎపిసోడ్స్ తప్పకుండ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లోని చైతు మరియు వెంకీల మధ్య ఎమోషనల్ సీన్ అయితే చిత్రానికి ప్రధాన బలం. అలాగే ఇతర కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్,నాజర్ మరియు రావు రమేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. థమన్ మ్యూజిక్ బాగుంది. ప్రసాద్ మూరెళ్లౙ్సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు రీచ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ : ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల కాస్త విసుగ్గా అనిపిస్తోంది. అలానే కథనం విషయంలో దర్శకుడు ఇంకాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తోంది.

మొత్తంగా : వెంకీ, చైతూ మామ అల్లుళ్ళుగా ప్రేక్షకులను మెప్పించారని చెప్పొచ్చు. కామెడీ, హీరోల మధ్య వచ్చే సీన్స్, ఎమోషన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఫైనల్ గా ఈ సినిమాని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -