Saturday, April 20, 2024
- Advertisement -

ఆలస్యాన్ని కవర్ చేస్తున్న వెంకీ మామ

- Advertisement -

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమా వెంకీ మామ కి సంబంధించిన షూటింగ్ లో బిజీ గా పాల్గొంటున్నాడు. ఈ సినిమా ని కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తుండగా, నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా లో పాయల్ రాజపుత్, మరియు రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు.

అయితే ఫిలిం యూనిట్ నుండి వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం ఈ సినిమా షూట్ ఇప్పటి వరకు బాగా వచ్చిందట.అప్పుడెప్పుడో ఒకసారి వెంకటేష్ కి గాయం అయిన కారణం గా సినిమా షూట్ కొంత ఆలస్యం అయింది. అయితే ఇప్పుడు అనవసరమైన డిలే కి ఆస్కారం ఇవ్వకూడదు అని ఫిలిం యూనిట్ ఆలోచించారట. అందుకే ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు ఒక అప్డేట్ ఇచ్చారు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ సినిమా త్వరగా ముగించాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇకపోతే ఈ సినిమా తర్వాత వెంకటేష్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నారు. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల సినిమా లో నటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -