Thursday, April 25, 2024
- Advertisement -

కాలర్ ఎగరేస్తున్న మామా అల్లుళ్లు

- Advertisement -

విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వెంకీ మామ’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ బాబి పుట్టినరోజు సందర్భంగా ‘వెంకీ మామ’ సినిమా నుంచి ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేశారు. బాబీ మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ చెప్పడం తో మొదలయ్యే ఈ వీడియో సినిమాలో వెంకటేష్ మరియు నాగ చైతన్య లుక్ ఎలా ఉండబోతోందో అని చూపిస్తుంది. వెంకీ, చై ఇద్దరూ కలిసి కాలర్ ఎగరేస్తూ నడిచి వస్తున్న సీన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇంతకుముందు నాగచైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో వెంకీ గెస్ట్ పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. రాశి ఖన్నా, పాయల్ రాజపుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -