మళ్ళీ వాయిదా పడిన ‘వెంకీ మామా’

232
'Venky Mama's Release Postponed to December
'Venky Mama's Release Postponed to December

మొట్టమొదటి సారిగా విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకీ మామ’. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజపుత్ మరియు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లోని చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఒక్క పాట మినహా మిగతా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 4న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. కానీ ఆక్టోబర్ 2న మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల కానుంది.

మెగాస్టార్ సినిమాతో క్లాష్ రాకుండా ఇప్పుడు ‘వెంకీ మామా’ సినిమాని వాయిదా వేసినట్టు సమాచారం. ఈ మధ్యనే అక్టోబర్ 25న దీపావళి సందర్భంగా సినిమా విడుదల అవుతుంది అని అన్నారు కానీ ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడడంతో అభిమానులు నిరాశ పడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. డిసెంబర్ అంటే పూర్తి డల్ సీజన్ కాబట్టి కలెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశాలు లేకపోలేదు. డి.సురేష్ బాబుతో మరియు టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Loading...