Thursday, April 25, 2024
- Advertisement -

“తలుపు వేయొద్దు అన్నానని దర్శకుడు వెళ్ళిపోయాడు..”

- Advertisement -

తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే అనుష్క ఎలా గుర్తుకు వస్తుందో బాలీవుడ్ లో విద్యాబాలన్ అలా గుర్తొస్తుంది. రెగ్యులర్ సినిమాలకు దూరంగా కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న విద్యాబాలన్ ఉత్తమనటిగా జాతీయ అవార్డు కూడా గెలుపొందారు. అయితే ఆమె విజయం వెనుక ఎన్నో అవమానాలు వేధింపులు ఉన్నాయని ఆమె ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. 1990 లో ‘హమ్‌ పాంచ్‌’తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక 2003లో వచ్చిన బెంగాలీ చిత్రం ‘భలో థేకో’ లో కనిపించిన విద్య ఈ రెండు సినిమాల మధ్య చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్న విషయం తెలిపింది.

“చెన్నైలో ఉన్నపుడు ఓ దర్శకుడు నన్ను కలవడానికి వచ్చాడు. ఎక్కడైనా కాఫీ షాప్‌లో కూర్చుని మాట్లాడుకుందామంటే అతడు హోటల్‌ కే వెళదామన్నాడు. తప్పని సరి పరిస్థితుల్లో హోటల్‌కి వెళ్లాను. కానీ అక్కడ మేమున్న గది తలుపులు మూయద్దని వారించాను. దాంతో ఆ దర్శకుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో అపుడు నాకు అర్థం కాలేదు కానీ తర్వాత చాలా భయపడ్డాను.” అని చెప్పారు విద్య బాలన్. తర్వాత కూడా ‘లావుగా ఉన్నావ్‌, ఫ్యాషన్‌ సెన్స్‌ లేదు’ అంటూ తనపై బోలెడు విమర్శలు వచ్చాయి అని అన్నారు విద‍్య. తాజాగా ఈమె నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ కూడా భారీ విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -