Tuesday, April 23, 2024
- Advertisement -

మ‌రోసారి లిప్ లాక్‌తో రెచ్చిపోయిన’ గీతా గోవిందం’ జోడీ

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్‌స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కొత్త సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టాక్సీ వాలా సినిమా త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను మొదట ఫైట్‌తో మొద‌ల‌పెట్టి చివ‌రికి లిప్ లాక్‌తో ముగించారు. టీజ‌ర్‌తో హీరో క్యారెక్ట‌ర్ ఎలాంటిదో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. రెబెల్ యాటిట్యూడ్‌ను ఘాటు రొమాన్స్‌తో మిక్స్ చేసి ఒక మెలోడీ సాంగ్ నేపథ్యంలో కవితాత్మకంగా చూపించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా గీతా గోవిందం బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది.

గ‌తేఏడాది వచ్చిన ఈ సినిమా ఎంత‌టి విజ‌యం సాధించిందో కూడా అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఈ సినిమా 100 కోట్ల‌కుపైగా సాధించి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌రోసారి ఈ జంట క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో డియ‌ర్ కామ్రేడ్‌పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్‌తో సినిమా పోరాట‌ల‌తో పాటు లిప్ లాక్‌ల‌కు కొదవ లేద‌ని తెలిపోయింది. టాలీవుడ్‌లో లిప్ లాక్ పెట్టాలి అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే పెట్టాలి అనేంతగా మార్చేశాడు మ‌నోడు. ఇక సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -