Saturday, April 20, 2024
- Advertisement -

నిహారిక‌ను చెల్లెలు అని పిలిచి త‌ప్పించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ త‌రువాత వ‌చ్చిన గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాల హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంద‌మ‌ని భావించింది మెగా డాట‌ర్ నిహారిక‌. నిహారిక తాజాగా న‌టించిన చిత్రం సూర్య‌కాంతం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న(ఆదివారం)హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విజ‌య్ దేవ‌ర‌కొండ హాజ‌రైయ్యాడు. ఈ ఫంక్ష‌న్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌స్తున్నాడ‌ని సూర్య‌కాంతం సినిమా యూనిట్ బాగానే జ‌రిగింది. నిహారిక ఫంక్ష‌న్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎందుకు వ‌స్తున్నాడ‌నే ప్ర‌శ్న అంద‌రిలోను మొద‌లైయింది.

దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడ‌ని సోషల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ మ్యాట‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌కు వెళ్లింద‌నుకుంటా. ఈ మ్యాట‌ర్ నుంచి ఈజీగానే త‌ప్పించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నిహారిక ఫ్యామిలీ వాళ్లు బిజీగా ఉండటంతో ఈ ఫంక్ష‌న్‌కు రాలేక‌పోయార‌ని, త‌న అన్న స్థానంలో నేను ఇక్క‌డి వ‌చ్చాన‌ని చెప్పి ఈ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. దీనిపై నెటిజ‌న్లు ర‌కార‌క‌లుగా స్పందిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ మామూలోడు కాద‌ని కొంద‌రు అంటుంటే, పాపం బ్ర‌తికిపోయాడ‌ని మ‌రి కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికి విజ‌య్ దేవ‌ర‌కొండ తెలివితేట‌ల‌కు అంద‌రు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -