Thursday, April 25, 2024
- Advertisement -

మాట ఇచ్చి తప్పిన విజయ్ దేవరకొండ

- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ ప్రచార పనుల్లో బిజీగా గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. సినిమా లోని ఒక పాట విడుదల చేసిన విజయ్ ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. ఇదే విషయమై స్పందిస్తూ, ఈ సినిమా దర్శకుడు భారత్ కమ్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. “మీరంతా ఈ పాట కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి నాకు తెలిసిందే. కానీ ఈ సారి ఎక్స్క్యూజ్ అడగక తప్పడం లేదు. ప్రతి క్లాస్ లో బాడ్ స్టూడెంట్ లాగా విజయ్ దేవరకొండ కూడా మమ్మల్ని పని చేయకుండా డిస్ట్రాక్ట్ చేసాడు. అందుకు అందరికీ నా క్షమాపణలు.

ఈ సారి పాట 15 న 11.11 కి ఖచ్చితంగా విడుదల చేస్తాము.” అన్నాడు. అలాగే విజయ్ కూడా స్పందిస్తూ, డైరెక్టర్ ట్వీట్ ని కోట్ చేస్తూ, “నా పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ ఆడాము, తర్వాతా బాడీ పైన్స్ వచ్చాయి. కూర్చొని ఇదే పాట ని పదే పదే విన్నాము. దానితో పాట కట్ చేయడం పూర్తి కాలేదు. మా టీచర్ డిస్ట్రాక్ట్ అయ్యాడు. 15 న సాంగ్ రావడం పక్కా అని ట్వీట్ చేసాడు.” సో ఇద్దరూ ప్రమోషన్స్ విషయం లో మంచి అండర్ష్టాండింగ్ లో ఉన్న విషయం అర్ధం అవుతుంది. అందరిలా గా టెక్నీకల్ ప్రాబ్లమ్ అని చెప్పకుండా సాంగ్ వాయిదా ని మంచి క్రియేటివ్ గా అనౌన్స్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -