Tuesday, April 23, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌రకొండ ‘నోటా’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

- Advertisement -

పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి,గీతా గోవిందం హిట్ల‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ.యూత్‌లో విజ‌య్‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌నోడి సినిమాల‌కు డిమాండ్ బాగా ఏర్ప‌డింది. విజ‌య్ తాజాగా న‌టించిన చిత్రం నోటా. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.ప్ర‌స్తుత రాజ‌కీయ‌ల‌కు సెటైర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ,త‌మిళ‌,తెలుగు రెండు బాష‌ల‌లో తెర‌కెక్కింది.అయితే సినిమా విడుద‌ల విష‌యంలో నోటాపై వివాదాలు అలుముకున్నాయి.తాజాగా ఆ వివాదాల‌ను దాటుకుని సినిమా విడుద‌ల తేదిని ఫిక్స్ చేసుకున్నారు.

అక్టోబర్ 5 న నోటా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఫిలిం మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పవర్ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేయడం విశేషం.మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ – నాజర్ ఇతర కీలక పాత్రలలో నటించారు. విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ఆనంద్ శంకర్ దర్శకుడు. మ‌రి నోటా విజ‌య్‌కు మ‌రో హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -