Friday, April 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సంచ‌ల‌న‌ కామెంట్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్థార్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా సినిమా వ‌చ్చే నెల 5న విడుద‌ల కానుంది.అయితే నోటా విడుద‌ల విఝ‌యంలో ఎన్ఠీఆర్ ఫ్యాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు మ‌ధ్య పెద్ద వార్ న‌డుస్తుంది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా సినిమా ద‌స‌రాకు కానుకుగా అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్నారు.నోటా విడుద‌ల అయిన వారం రోజుల‌కి ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత సినిమా విడుదల అవుతుంది.దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై రెచ్చిపోతున్నారు.

ఎన్టీఆర్ సినిమాకి పోటీగా విడుదల చేసే ధైర్యం చేస్తావా..? అంటూ అతడిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న విజయ్ కి ఎదురైంది.దీనిపై స్పందించిన విజయ్.. ”తారక్ అన్న సినిమాతో నా సినిమా రిలీజ్ ని ఫ్యాన్స్ వద్దనడం కరెక్ట్ కాదు.. సినిమాలను సినిమాలుగా చూడాలి” అని తారక్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు.ఎన్టీఆర్ అర‌వింద స‌మేత అక్టోబ‌ర్ 11న విడుద‌ల కానుంది.మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన కామెంట్స్‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా రీసివ్ చేసుకుంటారో చూడాలి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -