Thursday, April 25, 2024
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కి గిఫ్ట్ పంపిన దేవరకొండ

- Advertisement -

తెలుగు లో సూపర్ హిట్ ఐన అర్జున్ రెడ్డి సినిమాని హిందీ లో కబీర్ సింగ్ అనే పేరు తో రీమేక్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాకి కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా లో హీరోయిన్ గా కైరా అద్వానీ నటించగా, హీరో పాత్ర లో షాహిద్ కపూర్ నటించాడు. తెలుగు లో ఎలాగైతే హీరోయిన్ కి మంచి పేరు వచ్చింది, హిందీ లో కూడా ఈ సినిమా హీరోయిన్ కి చాలా పెద్ద పేరు వచ్చింది.

ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా విజయన్ని ఆస్వాదిస్తున్న కైరా కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్ పంపాడు. విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ పంపిన గిఫ్ట్ ని ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా లో అందరికీ చూపించింది.

తన బట్టల కంపెనీ రౌడీ ద్వారా కొన్ని బట్టలు కూడా కైరా కి పంపాడు. బాలీవుడ్ లో ఒక హీరోయిన్ కి ఇలా విజయ్ గిఫ్ట్ పంపడం ఇదే మొదటిసారి. అయితే అభిమానులు ఎప్పటి నుంచో వీరు ఇద్దరు కలిసి నటించాలి అని భావిస్తున్నారు. మరి త్వరలో ఆ కొరిక నిజం అవుతుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -