Wednesday, April 24, 2024
- Advertisement -

త‌మిళ అర్జున్ రెడ్డిలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ స‌న్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండను ఓవ‌ర్‌నైట్ స్టార్‌ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. 2017లో వ‌చ్చిన ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇక ఈ సినిమాను త‌మిళ‌, హిందీ భాష‌ల‌లో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో ఈ సినిమాకు సందీప్‌రెడ్డి వంగానే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌లో రీమేక్‌లో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు. త‌మిళంలో విక్ర‌మ్ కొడుకు ధృవ్‌ను హీరోగా పరిచియం చేస్తు వ‌ర్మ అనే పేరుతో తెర‌కెక్కించిన ఈ సినిమాను మ‌ళ్లీ రీషూట్ చేస్తున్నారు. సినిమా అవుట్ పుట్‌పై చిత్ర యూనిట్ అంస‌తృప్తిగా ఉండ‌టంతో సినిమాను మ‌ళ్లీ మొద‌టి నుంచి తీస్తున్నారు.

సినిమా ద‌ర్శ‌కుడిని కూడా మార్చేశారు. తాజాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో క‌నిపించ‌నున్నాడ‌ట విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తెలుగులో ప్రియ ద‌ర్శ‌న్ చేసిన క్యారెక్ట‌ర్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ చేత చేయించాల‌ని చూస్తున్నార‌ట త‌మిళ నిర్మాత‌లు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తే సినిమాకు హైప్ వ‌స్తుంద‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ని వినికిడి. విజ‌య్ కూడా త‌మిళ అర్జున్ రెడ్డిలో గెస్ట్‌గా క‌నిపించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -