Friday, April 19, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ కొత్త అవతారం

- Advertisement -

రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా తో స్టార్ హీరో గా ఎదిగాడు. ప్రస్తుతం ఇంకొక పెద్ద విజయం తో విజయ్ ఇండస్ట్రీ లో తిరుగు లేని స్టార్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమా తో అది సాదించాలి అనే తపన తో ఉన్నాడు విజయ్. ఈ సినిమా జులై 26 న ప్రపంచవ్యాప్తం గా విడుదల కానుంది. అయితే విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తనని తాను ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళ్తున్నాడు.

ఒక వైపు సినిమా ల తో విజయం సాధిస్తూ నే మరో వైపు ఆ క్రేజ్ ని కాష్ చేసుకుంటూ బిజినెస్ లో కూడా ఎదుగుతూ వస్తున్నాడు. తాజా సమాచారం మేరకు విజయ్ త్వరలో రౌడీ మార్కెట్ అని ఆవిష్కరించి తన దుస్తుల్ని అమ్మే పనిలో ఉన్నాడు. అంతే కాకుండా నిర్మాత గా మారిన విజయ్ కింగ్ అఫ్ ది హిల్ సంస్థ మీద కొన్ని చిత్రాలు నిర్మించాలనే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగం గా ఒక చిత్రం ఆల్రెడీ నిర్మాణ దశ లో కి కూడా ఎంటర్ అయింది.

అయితే విజయ్ రచయిత గా కూడా మారాడు అని తెలుస్తుంది. కథా రచయిత గా ఒక ఐదు స్క్రిప్ట్స్ రాసుకున్నది విజయ్. త్వరలో ఒక స్క్రిప్ట్ ని సినిమా గా మలచాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నాడట. మరి ఇంతలో ఎంత వరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -