Thursday, April 25, 2024
- Advertisement -

పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ..!

- Advertisement -

విజయ్ దేవరకొండ.. ఈ పేరుకు యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ తరం యువకులు విజయ్ దేవరకొండ ను రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. అలాంటి విజయ్ దేవరకొండ తన పేరులో మార్పు చేసుకున్నాడు.

’దేవరకొండ విజయ్ సాయి’ గా తన పేరులో మార్పు చేసుకున్నాడు. తన తాజా చిత్రమైన ’వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు గాను ఆయన ఇదే పేరును వేసుకున్నాడు. రీసెంట్ గా వదిలిన టీజర్ వలన ఈ విషయం తెలిసింది. కెరీర్ లో మరింత కలిసి రావాలనే సెంటిమెంట్ తో ఆయన ఇలా చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. ఇక ఈ మూవీలో విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

ఆయన సరసన నాయికలుగా రాశి ఖన్నా.. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన.. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -