Friday, April 19, 2024
- Advertisement -

గేర్ మార్చి స్పీడ్ పెంచిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

- Advertisement -

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరైన విజయ్ దేవరకొండ తాజాగా ‘ట్యాక్సీవాలా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాక్సీవాలా ఫస్ట్‌ గేర్‌ పేరుతో ఓ చిన్న వీడియో బైట్‌ను వదిలారు. ఫుల్‌ జోష్‌తో టాక్సీలో దూసుకెళ్తున్న విజయ్‌ లుక్కును రివీల్‌ చేశారు. జేక్స్‌ బెజోయ్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉంది

రాహుల్ సంకీర్తన్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో విజయ్ ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించబోతుండగా.. అతడి సరసన ప్రియాంకా జవల్కర్ నటిస్తోంది. ఈ సినిమాకు ‘ట్యాక్సీవాలా’ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసింది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయనుంది.

ట్యాక్సీవాలా చిత్రాన్ని ఎస్కేఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఆ పోస్టర్‌లో కేవలం కారు మాత్రమే ఉండటంతో.. అర్జున్ రెడ్డి తదుపరి చిత్రం ఎలా ఉండబోతుందోననే ఆసక్తి పెరిగింది. ట్యాక్సీవాలా విజయ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పిన నిర్మాతలు.. మే 18న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. యువ‌త‌ను ఈ సినిమా ఏవిధంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -