నింగికెగిసిన ‘విజయ నిర్మల’

162
Vijaya Nirmala Passes Away at 73
Vijaya Nirmala Passes Away at 73

ప్రముఖ నటి, దర్శకురాలు, రచయిత, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల బుధవారం అర్ధ రాత్రి స్వర్గస్థులయ్యారు. వయసు సంబంధిత అనారోగ్యం కారణం గా ఆవిడ కాంటినెంటల్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతూ చనిపోయారు. కన్ను మూసే నాటికి ఆమె వయసు 75. 7 ఏళ్ళ వయసు లోనే బాల నటి గా ఆమె తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టారు. పాండురంగ మహత్యం ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత రంగుల రాట్నం సినిమాలో పని చేశారు. ఆ తర్వాత నరేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపుగా తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200 పైగా సినిమాల్లో ఆవిడ నటించారు.

అందులో యాభై సినిమాల్లో ఆవిడ కృష్ణ కి జోడి గా నటించారు. దర్శకురాలిగా మీనా అనే సినిమా తో ముందుకు వచ్చారు. నేరము-శిక్ష ఆమె ఆఖరి చిత్రం. ప్రపంచం లో అత్యధిక సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకున్నారు. మొదటి భర్త తో విడిపోయాక సూపర్ స్టార్ కృష్ణ ని వివాహం చేసుకొని హాయిగా జీవితం సాగించారు. ఆవిడ కి మొదటి భర్త తో కలిగిన సంతానం నరేష్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమ లో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్నారు.

తన ఒరిజినల్ పేరు నిర్మల కాగా, విజయ ప్రొడక్షన్స్ వారు తనకి మొదటి అవకాశం ఇచ్చారు అనే గౌరవం తో విజయ ని తన పేరు ముందు పెట్టుకున్నారు. ఈ రోజు నానకరాంగూడ లో ని తన స్వగృహం లో విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఉంచుతారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరుపనున్నారు.