దేవరకొండ ఎన్ని కుటుంబాలకు సాయం చేశాడో తెలుసా ?

492
Vijaydevarakonda puts Middle class fund in rest mode
Vijaydevarakonda puts Middle class fund in rest mode

కరోనా వలన మధ్యతరగతి ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కున్నారు. మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి సెన్సేషనల్ విజయ్ దేవరకొండ రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు సాయం అందించడానికి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేశాడు. నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం రూ. 25 లక్షల రూపాయలతో ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ఏర్పాటు చేసాడు.

మిగతా డబ్బులతో యూత్ కు ఎంప్లాయిమెంట్ కోసం ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’ ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా తాను ఏర్పాటు చేసిన ‘మిడిల్ క్లాస్ ఫండ్’కు ఎవరైనా నిధులు పంపించవచ్చు అని వెల్లడించాడు. రెండు వేల మందికి సాయం చేద్దామనుకున్న విజయ్ ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ద్వారా వేల కుటుంబాలకు సహాయం చేసేంత ఫండ్స్ రెయిజ్ చేశారు. ప్రతి వారం తన ఫౌండేషన్ డిటైల్స్ ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ వచ్చాడు. కాగా ఇప్పటివరకు ఎంత మందికి సాయం అందింది అనే విరాళాలు వెల్లడించారు. మిడిల్ క్లాస్ ఫండ్ ఎలా వర్క్ చేసిందో.. ట్రాన్సపరెంట్ గా అన్ని విషయాలు సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇప్పటి వరకు 17723 కుటుంబాలకు అంటే.. 58808 మందికి సాయం చేశారు.

535 మంది వాలంటీర్లు పనిచేయగా.. మొత్తం 1.71కోట్ల ఫండ్ ఖర్చు చేసినట్టు.. అందులో 8515 మంది విరాళాలు ఇవ్వగా.. వారిచ్చిన మొత్తం 1.50 కోట్లుగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా అనేది భవిష్యత్తులో అందరినీ ఏదో రకంగా గుర్తుగా మిగిలిపోతుందని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు వచ్చాయి కాబ్టటి ప్రస్తుతానికి మిడిల్ క్లాస్ ఫండ్ ను రెస్ట్ మోడ్ లో ఉంచుతున్నానని.. మళ్లీ అవసరం వస్తే యాక్టివేట్ చేస్తామని విజయ్ దేవరకొండ తెలియజేశారు.

Loading...