Friday, April 26, 2024
- Advertisement -

ప్రముఖ హీరోతో పెళ్లి రద్దు చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి

- Advertisement -

హాలీవుడ్ ప్రముఖ హీరో విశాల్ ఈ మధ్యనే హైదరాబాద్ కి చెందిన అనీషా అల్లాది అనే మోడల్ మరియు నటితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ప్రేమ పెళ్ళి అని చెబుతున్న విశాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతామని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. ‘పెళ్లిచూపులు’ మరియు ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలలో చిన్న పాత్రలలో కనిపించిన అనిషా విశాల్ పెళ్లి ఈ ఏడాది ఆఖరులో జరగనుందని వార్తలు కూడా వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అనీషా విశాల్ తో తన నిశ్చితార్థాన్ని క్యాన్సల్ చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లిపీటలు ఎక్కకుండానే ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకున్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా విశాల్ మరియు అనిషా ల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయని, ఆ గొడవల కారణంగా వారి బంధం కూడా ల్ దెబ్బతిందని తెలుస్తోంది. ఇప్పటికే అనిషా ని కన్విన్స్ చేయడానికి విశాల్ చాలా ప్రయత్నించాడు కానీ అనిషా మాత్రం ఒప్పుకోలేదని, పెళ్లికి ససేమిరా నో చెప్పిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తమ నిశ్చితార్థం ఫోటోలను కూడా డిలీట్ చేసింది అనిషా. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో వెలువడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -